తెలంగాణా విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టిఎస్ ఎంసెట్ లో 45 శాతం మార్కుల నిబంధన తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టిఎస్ ఎంసెట్ 2020 లో అర్హత సాధించిన  విద్యార్థులను టిఎస్ ఎంసెట్ (అడ్మిషన్స్) -2020  కౌన్సెలింగ్ కు  హాజరు కావడానికి అనుమతి ఇచ్చారు. 10 + 2 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు టిఎస్ ఎంసెట్ -2020  లో అడ్డంకిగా మారిన 45 శాతం మార్కుల నిబంధనపై పలుమార్లు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధన 2020- 21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది అని  పేర్కొంది. భవిష్యత్తులో 2021- 22 సంవత్సరానికి ఈ నిబంధన వర్తించదు అని స్పష్టం చేశారు విద్యాశాఖ  శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి చిత్రా రామచంద్రన్. దీనిపై విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: