ఆరోగ్యసేతు యాప్‌ను ప్రైవేటు సంస్థల సహకారంతో ప్రభుత్వమే రూపొందించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. వైరస్‌ తీవ్రత కొనసాగుతుండడం, లాక్‌డౌన్‌ నిబంధనల నేపథ్యంలో కేవలం 21 రోజుల్లోనే ఈ యాప్‌ను అభివృద్ధి చేశామని పేర్కొంది. యాప్‌కు సంబంధించిన సోర్స్‌ కోడ్‌ను మే నెలలోనే కూడా ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది. అంతేకాకుండా యాప్‌ ఎలా పనిచేస్తుంది? కరోనా వైరస్‌ పోరులో ఇది ఏ విధంగా దోహదపడుతుందనే అంశాలను కూడా పోర్టల్‌లో స్పష్టంగా పేర్కొన్నట్లు ప్రభుత్వం మరోసారి వెల్లడించింది.


కరోనా వైరస్‌ పోరులో భాగంగా వైరస్‌ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన, అప్రమత్తం చేయడంలో ఆరోగ్య సేతు యాప్‌ కీలకంగా వ్యవహరించిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఇప్పటి వరకు ఈ యాప్‌ను 16.23 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని.. భారత్‌లో కరోనా కట్టడిలో ఆరోగ్య సేతు కీలక పాత్ర పోషించిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ప్రశంసించిన విషయాన్ని ప్రభుత్వం గుర్తుచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: