ప్రపంచ క్షేమాన్ని కాంక్షించడం భారతీయ విధానం కాగా.. తన అధికార పరిధిని విస్తరించుకోవటమే చైనా లక్ష్యమని ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. చైనా తరహాలో సామ్రాజ్య విస్తరణ, విదేశీ భూభాగాల ఆక్రమణ భారత సంస్కృతిలో భాగం కాదని.. పొరుగు దేశాలకు భారత్‌ పట్ల అభద్రతా భావం లేదని కేంద్ర మంత్రి అన్నారు. ‘‘రామ్‌ మందిర్‌ టు రాష్ట్ర మందిర్‌’’ అనే ఆన్‌లైన్‌ పుస్తకావిష్కరణ సందర్భంగా గడ్కరీ ప్రసంగించారు.


గల్వాన్‌లో ఇటీవల చోటుచేసుకున్న భారత్‌-చైనా ఘర్షణల నేపథ్యంలో నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సామ్రాజ్య విస్తరణ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌ సంస్కృతిలో భాగం కాదన్నారు. ప్రపంచమంతా క్షేమంగా ఉండాలనుకోవటం తమ దేశ చరిత్ర, సంస్కృతుల వారసత్వంగా లభించిందని ఆయన వెల్లడించారు. ఇతర దేశాలను ఆక్రమించే సామ్రాజ్యవాదం భారత వైఖరి కాదని మంత్రి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: