స్వచ్ఛంద కార్యకలాపాల కోసం వినియోగించాల్సిన నిధులను వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు మళ్లిస్తున్న ఎన్​జీఓలు, ట్రస్ట్​లకు సంబంధించిన కేసులో.. వరుసగా రెండో రోజు సోదాలు చేపట్టింది ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ). గురువారం ఉదయాన్నే శ్రీనగర్​, ఢిల్లీలోని 9 ప్రాంతాల్లోని ఆరు ఎన్​జీఓలు, ట్రస్టుల్లో ఈ సోదాలు నిర్వహించింది.ఎన్​జీఓల్లో.. ఫలాహ్​ ఈ ఆమ్​ ట్రస్ట్​, ఛారిటి అలియన్స్, హ్యూమన్​ వెల్​ఫేర్​ ఫౌండేషన్​, జేకే యతీమ్​ ఫౌండేషన్​, సాల్వేషన్​ మూవ్​మెంట్​, జేకే వాయిస్​ ఆఫ్​ విక్టిమ్స్​లు ఉన్నాయి.


 అంతకు ముందు శ్రీనగర్​, బందిపోరాల్లో బుధవారం 10 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది ఎన్​ఐఏ. అలాగే బెంగళూరులోని ఓ ప్రాంతంలో సోదాలు నిర్వహించింది.స్వచ్ఛంద సేవల ద్వారా నిధులు సేకరించి ఉగ్రసంస్థలకు అందిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఈనెల 8వ తేదీన ఐపీసీ సెక్షన్​ 120బీ,124ఏ, యూఏ(పీ)ఏ-1967 చట్టంలోని సెక్షన్ 17,18,22ఏ,22సీ, 38,39ల కింద కేసు నమోదు చేసి.. సోదాలు నిర్వహిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: