జమ్ముకశ్మీర్​లో ఎవరైనా భూములు కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయటంపై ఆందోళన చేపట్టింది పీపుల్స్​ డెమొక్రాటిక్​ పార్టీ (పీడీపీ). ప్రభుత్వ నిర్ణయం వల్ల కశ్మీర్​లో నేరాలు పెరిగిపోతాయని.. ఈ చట్టాన్ని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది.ఈ క్రమంలో నిరసనకారులను అడ్డుకున్నారు పోలీసులు. శ్రీనగర్​లోని పీడీపీ కార్యాలయాన్ని మూసివేశారు. సీనియర్​ నాయకులు, పార్టీ నేతలను అరెస్ట్​ చేశారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.


జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన 15 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఇతర ప్రాంతాల వారు కూడా జమ్ముకశ్మీర్‌లో భూమి కొనుగోలుకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి చట్టంలోని సెక్షన్‌ 17లో ఉన్న ఆ రాష్ట్రానికి చెందిన శాశ్వత వ్యక్తి అనే పదాన్ని తొలగించింది. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌కు చెందని వ్యక్తులకు అక్కడ భూమి కొనుగోలులో చట్టబద్ధంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: