భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ దీపక్​ మిశ్రా(రిటైర్డ్​) ఎంపికను సవాల్​ చేస్తూ పిటిషన్​ దాఖలు చేసిన స్వామి ఓంపై సుప్రీకోర్టు సీరియస్​ అయ్యింది. పిటిషనర్​కు రూ.5 లక్షల జరిమానా విధించిన సుప్రీం.. ఆ సొమ్మును 8 వారాల్లోపు చెల్లించాలని ఆదేశించింది. అలాగే తీర్పును సమ్మతిస్తున్నట్లు నివేదిక సమర్పించాలని కోరింది.


2017లో జస్టిస్​ దీపక్​ మిశ్రాను భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేయటాన్ని సవాలు చేస్తూ స్వామి ఓం పిటిషన్ దాఖలు చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్​ జేఎస్​ ఖేహర్​ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్​ను కొట్టివేసింది. స్వామి ఓం తోపాటు సహ పిటిషనర్​ ముకేశ్​ జైన్​లు తలో రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టులను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: