కొవిడ్​ వ్యాక్సిన్​ పేరుతో జరుపుతున్న పలురకాల మందుల అమ్మకాలపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. రెమిడెసివిర్​, ఫావిపిరవిర్​ వంటి ధ్రువీకరించని ట్రయల్​ మందులకు సంబంధించిన 10 ఫార్మా కంపెనీలపై విచారణ చేపట్టాలని న్యాయవాది ఎం.ఎల్​ శర్మ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించింది న్యాయస్థానం.


అత్యవసర పరిస్థితుల్లోనే ఈ మందులను కరోనా రోగులకు వాడాలన్ననిబంధనను గుర్తుచేస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు శర్మ. ఈ విషయంపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. డబ్ల్యూహెచ్​ఓ నివేదికను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: