ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్​పై సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ముఖ్యమంత్రి వాదన వినకుండానే హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం ఆశ్చర్యం కలిగించిందని జస్టిస్ అశోక్ భూషణ్​ ధర్మాసనం పేర్కొంది.సీఎంపై అవినీతి ఆరోపణలకు సంబంధించి జర్నలిస్టులు వేసిన పిటిషన్​లో ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలన్న అభ్యర్థన లేదని తెలిపింది.


రావత్​ తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్... సీఎం వాదనలు వినకుండా ఎఫ్​ఐఆర్ నమోదు చేయలేమని స్పష్టం చేశారు. ఇది ఎన్నిక ద్వారా గెలిచిన ప్రభుత్వంలో గందరగోళాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన రాజీనామాకు డిమాండ్లు వినిపిస్తున్నాయని తెలిపారు. వీటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ఆదేశాలిచ్చిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: