సూపర్ స్టార్ రజినీకాంత్​ రాజకీయాలకు ఎప్పటికీ దూరంగానే ఉండనున్నారా? కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఆయన రాజకీయ అరంగేట్రం మొదలుకాకముందే ముగియనుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు రజినీకాంత్ ప్రకటించినట్లుగా ఓ లేఖ వైరల్ అవుతోంది. గత రాత్రి నుంచి ప్రచారంలో ఉన్న లేఖపై రజినీకాంత్ తాజాగా స్పందించారు.


తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోలేదని రజినీ అన్నారు. అయితే తన ఆరోగ్యం గురించి వైరల్ అయిన లేఖలో పేర్కొన్న వివరాలు మాత్రం నిజమేనన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లే విషయంపై వైద్యులు పలు సూచనలు చేసినట్లు సూపర్​ స్టార్​ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన అభిమానుల కోసం ఓ లేఖ విడుదల చేశారు.రజినీకాంత్ 2011లో మూత్రపిండాల సమస్యతో బాధపడ్డారని, ఈ సమస్యకు సింగపూర్ వెళ్లి చికిత్స తీసుకున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. 2016లో అదే సమస్య రావ‌డం వల్ల అమెరికా వెళ్లి కిడ్నీ మార్పిడి చేయించుకున్నారని, కరోనా నేపథ్యంలో రజినీకాంత్ రాజకీయాలకు దూరంగానే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ లేఖలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: