పేదరికంలో ఉన్న ఓ కుటుంబం ఆడ బిడ్డ పుడితే అమ్మేసేయోచ్చని ముందే ఒప్పందం చేసుకున్నారు. కానీ పుట్టింది మగ బిడ్డ అని తెలిసి.. మోసపోయామంటూ వాపోతున్నారు. తమ బాబును తిరిగి ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బిడ్డను అమ్ముకున్న తల్లిదండ్రులతో సహా పలువురి అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించారు. పుట్టిన పిల్లాడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.

ఈ ఘటన హైదరాబాద్ నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కాప్రా సర్కిల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న రాజేశ్ దంపతులకు పిల్లలు లేరు. దీంతో ఎవరినైనా దత్తత తీసుకోవాలని భావించారు. మధ్యవర్తి ద్వారా నాచారం ప్రాంతానికి చెందిన మీనా, వెంకటేశ్ దంపతుల దగ్గరికి వెళ్లి ఒప్పందం కుదర్చుకున్నారు. ఆడపిల్ల పుడితే అమ్మేందుకు వెంకటేశ్ దంపతులు ఒప్పుకున్నారు. కాగా, జులై 19వ తేదీన రాజేశ్ బాధితురాలిని తన భార్యగా పరిచయం చేసి ఈఎస్ఐ ఆస్పత్రిలో జాయిన్ చేయించాడు. డెలివరీ అయిన మరుక్షణం పుట్టిన బిడ్డను తీసుకుని వెళ్లిపోయాడు. 5 నెలల తర్వాత పుట్టింది మగబిడ్డ అని తెలిసి.. వెంకటేశ్ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: