ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. పండుగ సీజన్‌లో డిమాండ్ పెంచడానికి ఆర్థిక శాఖ ఉద్యోగులకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే అమలులో ఉన్న ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్‌ను నాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వోచర్ను ఉపయోగించుకునే ఉద్యోగుల క్యాష్ పేమెంట్‌కు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు.. తాజాగా విడుదల ఉత్తర్వుల ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
 
ఈ ప్రకటనతో వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు ఎల్‌టీఏ స్కీమ్‌ ద్వారా హాలిడే ట్రిప్ ట్రావెల్ ఖర్చును రీయింబర్స్‌మెంట్ చేయనున్నాయి. అయితే, ఈ స్కీమ్ 12 శాతం లేదా ఆపై జీఎస్‌టీ ఉన్న వస్తువులను డిజిటల్ రూపంలో కొనుగోలు చేస్తేనే వర్తిస్తుందని వెల్లడించింది.  అక్టోబర్ 12 నుంచి 2021 మార్చి 31లోపు కొనుగోలు చేసిన ఆయా వస్తువులకు మాత్రమే ఎల్టీసీ వర్తింపచేయనున్నట్టు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: