ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చేపట్టిన స్తంభాల పరీక్షలు పూర్తయ్యాయి. ఐఐటీ మద్రాస్​, సాంకేతిక నిపుణల అధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించారు. స్తంభాల సామర్థ్యాలనుబట్టి అవి వెయ్యేళ్లపాటు మన్నికగా ఉంటాయని నిపుణులు తెలిపారు. భూకంపం, ఇతర ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేలా దృఢంగా ఉన్నాయని పేర్కొన్నారు.


రామాలయ నిర్మాణ పునాది పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు. 1200 స్తంభాలను నిలబెట్టేందుకు.. సుమారు 100 అడుగుల లోతు వరకు పునాదులు తవ్వుతున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నిర్మాణం కోసం.. రాజస్థాన్​లోని భరత్​పుర్​ గనులకు చెందిన ప్రత్యేక శిలలను ఉపయోగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: