భారత నావికాదళం శుక్రవారం.. నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్‌) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. క్షిపణి కార్వెట్‌ ఐఎన్‌ఎస్‌ కోరా నుంచి బంగాళాఖాతంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.గరిష్ఠ దూరంలో ఉంచిన ఓ నౌకను లక్ష్యంగా చేసుకొని ప్రయోగం నిర్వహించగా.. క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు నావికాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు.



భారత నావికాదళంలోని మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేసే విషయమై కేంద్రానికి ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆఖరు వరకు పొడిగించింది.పురుషులతో పాటు మహిళా అధికారులకు సమాన హోదా కల్పించే లక్ష్యంతో.. భారత నావికాదళంలోని మహిళా ఎస్​ఎస్​సీ అధికారులకు శాశ్వత కమిషన్​ మంజూరు చేయాలని ఈ ఏడాది మార్చి 17న సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మూడు నెలల్లోగా దీనిని అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కరోనా నేపథ్యంలో గడువును ఆరునెలలు పొడిగించాలంటూ జూన్‌లో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: