మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​కు ప్రముఖ ప్రచార కర్త హోదాను రద్దు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. పదే పదే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్‌ పార్టీ తరఫున కమల్‌నాథ్‌ ప్రముఖ ప్రచారకర్తగా ఉన్నారు.


తాజాగా ఎన్నికల సంఘం ఆ హోదాను రద్దు చేసినందున ఇకపై కమల్‌నాథ్‌ ఎక్కడకు ప్రచారానికి వెళ్లినా.. ప్రయాణం, వసతి తదితర ఖర్చులను ఆయా నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థులు భరించాల్సి ఉంటుంది.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌కు గట్టి షాకిచ్చింది ఎన్నికల సంఘం. ఇప్పటివరకు ఉన్న ప్రముఖ ప్రచార కర్త హోదాను ఇవాళ రద్దు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: