వైష్ణోదేవి ఆలయంలోకి నవంబర్‌ 1 నుంచి నిత్యం 15 వేల మంది భక్తులను అనుమతించనున్నట్లు మందిర పాలకవర్గం వెల్లడించింది. కొవిడ్-19 నిబంధనల కారణంగా ఇప్పటివరకు రోజూ 7 వేల మంది భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు.అమ్మవారి దర్శనానికి అనుమతించే విషయంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. రోజూ 15 వేల మంది భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా మార్పులు చేసినట్లు తెలిపింది.


భక్తుల దర్శనానికి సంబంధించిన అంశం మినహా ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనలు యథావిధిగా నవంబర్‌ 30 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.దాదాపు 5 నెలల లాక్‌డౌన్‌ తర్వాత ఆగస్టు 16న వైష్ణోదేవి ఆలయాన్ని తిరిగి తెరిచారు. మొదట్లో 2 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: