కరోనాను అరికట్టేందుకు అమెరికన్ బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా అభివృద్ధి చేస్తోన్న టీకా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం మూడోదశలో ఉన్న MRNA-1273 ప్రయోగాల్లో.. తాము చురుగ్గా పాల్గొంటున్నట్టు మోడెర్నా సీఈఓ స్టెఫానీ బన్సెల్ తెలిపారు. వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి ఆయా ప్రభుత్వాలతో.. ఇప్పటికే తాము ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ వ్యాక్సిన్కు సంబంధించి ఇప్పటికే మూడో దశ నమోదు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు బన్సెల్.


రెండోదశ అధ్యయన ఫలితాలపై దృష్టి సారించినట్టు చెప్పారు. ఈ టీకా అధిక నాణ్యత, ప్రమాణాలతో శాస్త్రీయ పరిశోధనలకు కట్టుబడి తయారుచేస్తున్నట్లు స్పష్టం చేశారు.జులైలో ప్రయోగాలు మొదలుపెట్టిన మోడెర్నా.. అక్టోబర్ 22న MRNA-1273కు సంబంధించి మూడోదశ ట్రయల్స్ ప్రారంభించింది. సుమారు 30వేల మంది వ్యాక్సిన్ ట్రయల్స్లో భాగమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: