అకాల వర్షాల దెబ్బకు వరదలు భారీగా రావడంపై అందరిలో ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు భవిష్యత్తులో ఏ విధమైన ముప్పు ఉంటుందో అని  అందరూ కూడా కంగారు పడుతున్నారు. ఇక వరంగల్ జిల్లా అధికారులు సమర్ధవంతంగా వ్యవహరించారు. అకాల వర్షాల సమయంలో వరంగల్ లో భారీ వరదలను దృష్టిలో ఉంచుకుని, గౌరవ  మంత్రి కేటిఅర్ ఆదేశాలను పాటిస్తూ అక్రమ నాళాలను తొలగించారు.  

దీనిపై గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఒక ట్వీట్ చేసారు. కేటిఅర్ సార్... అన్ని అక్రమ నిర్మాణాలు, నాలా ఆక్రమణలను... తొలగించాలని ఆదేశించారు. 384 నిర్మాణాలు గుర్తించాము అని... 288 క్లియర్ చేసామని (కోర్ట్ స్టేతో 96 పెండింగ్‌లో ఉన్నాయి).  అని ట్వీట్ చేసారు. దీనిపై కేటిఅర్ హర్షం వ్యక్తం చేసారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ & మునిసిపల్ కమిషనర్ జిడబ్ల్యుఎంసికి నా అభినందనలు అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లో కూడా ఇవే వ్యూహాలు అనుసరిస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: