ఆకాశంలో నేడు చందమామ నీలం రంగులో దర్శనమివ్వనున్నాడు. సాధారణం కంటే ఈ సారి మరింత పెద్దదిగా.. ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. నిండు చంద్రులు నీలి రంగులో కనిపించడాన్ని ‘బ్లూ మూన్’గా పిలుస్తారు. అయితే చంద్రుడికి బ్లూ మూన్ అనే పేరు రావడం వెనుక ఎన్నో ఆసక్తికర అంశాలు దాగి ఉన్నాయి. 1883వ సంవత్సరంలో ఇండోనేషియాలోని క్రాకాటోవా అగ్ని పర్వతం పేలింది. దీంతో ఆకాశంలోకి పెద్ద ఎత్తున బూడిద ఎగసింది. ఈ బూడిద కారణంగా మేఘాలలోని కణాల రంగు మారింది. చంద్రుడు కూడా నీలం రంగులో దర్శనమిచ్చాడు. దీన్ని అరుదైన ఘటనగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిగణించింది. నాటి ఘటనను దృష్టిలో పెట్టుకుని అప్పటి శాస్త్రవేత్తలు ‘బ్లూ మూన్’గా నామకరణం చేశారు.

మరో రీసెర్చ్ కథనం ప్రకారం.. నిండు పౌర్ణమి ఏర్పడటానికి 29.5 రోజులు పడుతుంది. అంటే ఏడాదికి 12 సార్లు పౌర్ణమి ఏర్పడటానికి 354 రోజులు పడుతుంది. దీనితోపాటు ఏడాదిలో మిగిలిన రోజులను రెండున్నరేళ్లకు ఒకసారి కలిపితే ఓ ఏడాదికి 13 పౌర్ణమిలు వస్తాయి. అదనంగా వచ్చే ఆ పౌర్ణమినే ‘బ్లూ మూన్’గా పిలుస్తారు. ఈ రోజు రాత్రి 8.15 గంటలకు చంద్రుడు పూర్తి ప్రకాశవంతంగా కనిపిస్తాడు. 2001 తర్వాత ఈ అరుదైన ఘటన చోటు చేసుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: