సూపర్ స్టార్ కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు మంచి కానుకను అందించనున్నారు. నవంబర్ 7వ తేదీన కమల్ హాసన్ బర్త్ డే రోజున ‘కమల్ 232’ చిత్రానికి సంబంధించిన చిన్న టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి కమల్ స్వీయ నిర్మాణంలో రూపొందనుంది. సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా ఇంకొద్ది రోజుల్లో స్టార్ట్ కానున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమాకు సంబంధించి టెస్ట్ షూట్ ఇదివరకే చేశారు. ఈ షూట్ లో కమల్ హాసన్ పై తీసిన విజువల్స్ తోనే చిన్న టీజర్ ను విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రంలో కమల్ హాసన్ ను ఎప్పుడు చూడని విధంగా సరికొత్త లుక్ తో ప్రేక్షకుల ముందు రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్ర్కిప్ట్ పనులు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తి కానున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం కమల్ హాసన్ ‘భారతీయుడు-2’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదికి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: