ఆంధ్రప్రదేశ్ జీవనాడి గా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ కి కేంద్రం నిధులు ఇస్తుందా లేదా అనే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం  ప్రాజెక్ట్ విషయంలో ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వివాదాస్పదంగానే ఉంది. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రం కొత్త ట్విస్ట్ పెట్టింది. లెక్కలు చెబితేనే మిగిలిన రూ.9288 కోట్లు మాత్రమే చెల్లింపులు జరుపుతాం అని  పేర్కొంది.

పోలవరం కోసం ఇచ్చిన నిధులు దారిమళ్లించినట్టు కేంద్రానికి ఫిర్యాదులు వెళ్ళాయి. నవంబర్ 2వ తేదీ నాటి సమావేశంలో కేంద్రం నిర్ణయం బహిర్గతం చేసే అవకాశం ఉందని అంటున్నారు. తక్షణమే ఇవ్వాల్సిన రూ.2234 కోట్లపై కూడా షరతులతో మెలిక పెట్టింది. మరి ఈ విషయంలో ఏపీ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో అర్ధం కావడం లేదు. జగన్ ఈ నిర్ణయంపై కాస్త సీరియస్ గానే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: