సందీప్  రాజు దర్శకత్వంలో సునీల్, చాందినీ చౌదరి, సూహాస్ నటించిన చిత్రం కలర్ ఫోటో. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సినిమాల్లో ది బెస్ట్ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కథ సహా  అన్ని కూడా చాలా బాగున్నాయి అని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

 ఇక ఈ సినిమా స్టార్ హీరో అల్లు అర్జున్ కి చాలా బాగా నచ్చిందట. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  అల్లు అర్జున్ ని  కలర్ ఫోటో టీం ఆయన ఇంటికి వెళ్ళి కలిసింది. ఈ సందర్భంగా ఒక మొక్కను కూడా ఆయనకు బహుమతిగా ఇచ్చారు. దీన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బన్నీ సినిమా లో అన్ని చాలా బాగున్నాయి అని.... సంగీతం బాగుందని నటన బాగుందని ఎమోషన్స్ బాగున్నాయి అంటూ ట్విట్టర్లో  పోస్ట్ చేశాడు. టీం మొత్తానికి కూడా శుభాకాంక్షలు చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: