దుబ్బాక ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారం చేసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల నుంచి ఆయన ప్రచారానికి వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. సీఎం కేసీఆర్ మాత్రం దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం తమదే అని, తాము ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్తున్నారు.

 అయితే తాజాగా పరిస్థితులు కాస్త బీజేపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రచారానికి చివరి రోజైన ఆదివారం వెళ్లే అవకాశాలు ఉన్నాయని, మంత్రి కేటీఆర్ కూడా ప్రచారానికి వెళ్లే అవకాశాలు ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి పూర్తి సమాచారం కూడా రాలేదు. అయితే హరీష్ రావు మాత్రం సీఎం కేసీఆర్ అవసరం లేదని తాను చూసుకుంటానని చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తే మంచిది అనే భావన టిఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: