స్వీట్స్ ని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఇక పండుగలు వస్తే చాలు దేశంలో ప్రజలందరూ వేడుకల్లో మునిగి తేలుతుంటారు. ఇక ప్రత్యేకించి తీపిని ఎక్కువగా ఇష్టపడే గుజరాతీయులు పండుగుల పూటా విరివిరిగా స్వీట్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే సాధారణంగా ధర మనకు తెలిసి కిలో స్వీట్‌ రూ.500 నుంచి వెయ్యి వరకు ఉండొచ్చు. కానీ, గుజరాత్‌ రాష్ట్రంలో ఓ స్వీట్‌షాప్‌లో ఓ స్వీట్‌ ధర ఎంతో తెలుసా..? అక్షరాల తొమ్మిది వేల రూపాయలు. ఏంటి దాన్ని బంగారంతోగానీ చేశారా? అంత రేటెందుకు అని అనుకుంటున్నారా?అవును దానిపై బంగారు పూత పూశారు గనుకనే అంత ధర.

అయితే ఈ స్వీట్‌ను గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ పట్టణంలోగల ఓ స్వీట్‌షాప్‌ యజమాని తయారుచేయించారు. దీని పేరు ‘గోల్డ్‌ ఘరీ’. చాందీ పడ్వో అనే పండుగ కోసం దీన్ని విక్రయించేందుకు తయారుచేశారు. ఆయుర్వేదంలో బంగారం ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకర లోహంగా పరిగణించబడుతుందని, అందుకే ఈ స్వీట్‌ తయారుచేయించినట్లు యజమాని రోహన్‌ తెలిపారు. కాగా, ఈ స్వీట్‌ సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: