డిటెక్టివ్ సినిమాలు అనగానే గుర్తొచ్చేది జేమ్స్బాండ్ మూవీ. జేమ్స్బాండ్గా నటించి యావత్ ప్రపంచాన్ని మెప్పించిన హాలీవుడ్ నటుడు సీన్కానరీ ఇకలేరు. అనారోగ్య కారణాల వల్ల తన తొమ్మిదిపదుల వయస్సులో తనువు చాలించాడు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు.

జేమ్స్ బాండ్ సీరీస్ తొలిసినిమాలో హీరోగా నటించిన సీన్ కానరీ ప్రేక్షకుల మనసుల్ని ఆకట్టుకున్నాడు. దానితో ఆ తర్వాత జేమ్స్ బాండ్ సీరీస్లో వచ్చిన 7 సినిమాల్లోనూ కానరీనే నటించి అందరి ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నాడు. అవే కాకుండా అన్ టచబుల్, మార్నియే, మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్ప్రెస్, ది మ్యాన్ హూ వుడ్ బి కింగ్, ది నేమ్ ఆఫ్ ది రోజ్, హై ల్యాండర్ వంటి పలు చిత్రాల్లోనూ కానరీ నటించారు. అన్ టచబుల్ సినిమాలోని నటనకుగానూ సినీరంగంలో అత్యుత్తమ పురస్కారమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నాడు. సీన్ కానరీ తన కెరీర్లో రెండు బెఫ్ట, మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: