దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రితో చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఈ మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ సడలింపులతో షాప్స్ తెరుచుకొని, బస్సులు రెడ్డెక్కాయి. తాజాగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మ‌రో నెల రోజుల‌పాటు లాక్‌డౌన్‌ను పొడిగించింది.

అయితే ఈసారి అద‌నంగా మ‌రికొన్ని స‌డ‌లింపులు ఇస్తూ లాక్‌డౌన్‌ను పొడిగించిన‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు త‌మిళ‌నాడు స‌ర్కారు ఒక ప్ర‌క‌టన విడుదల చేసింది. 9, 10, 11, 12 త‌ర‌గ‌తుల విద్యార్థుల కోసం పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, అదేవిధంగా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు, ఇత‌ర విద్యాసంస్థ‌ల‌ను న‌వంబ‌ర్ 16 నుంచి తెరుచుకోవ‌చ్చ‌ని త‌మిళ‌నాడు స‌ర్కారు త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. మ‌రో వైపు సినిమా థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల‌ను కూడా న‌వంబ‌ర్ 10వ తేదీ నుంచి 50 శాతం కెపాసిటీతో తెరుచుకునేందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అవ‌కాశం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: