మెట్రో ప్రయాణికులకు మెట్రో సిబ్బంది మరొక శుభవార్త వినిపించారు. హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఆదివారం నుంచి మరో బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి రానుంది.. మెట్రో స్మార్ట్ రీఛార్జ్‌పై 50 శాతం వరకు అనగా రూ.600 వరకు క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్లు హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ ఆఫర్ ఒక్క మెట్రో స్టేషన్లలో మాత్రమే కాకుండా, ఆన్‌లైన్‌లో రీఛార్జ్‌ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తించనుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు వచ్చే క్యాష్ బ్యాక్ ఆటోమేటిక్ గా స్మార్ట్ కార్డులోనే జమ అవుతుందని వివరించారు.

 అయితే రీఛార్జ్‌ చేసుకున్న మొత్తాన్ని 90 రోజుల్లోగా వినియోగించుకోవాలనే షరతు ఉన్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన అన్నారు. నగరంలోని మూడు కారిడార్లలో కలిపి నిత్యం 1.30 లక్షల మంది వరకు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని వివరించారు. ఇటీవల ప్రకటించిన మెట్రో సువర్ణ ప్యాకేజీలో భాగంగా 40 శాతం రాయితీ ప్రకటించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఆ ఆఫర్ పెట్టాక మెట్రో ప్రయాణికుల సంఖ్య దాదాపు 30 శాతానికి పైగా పెరిగిందని వివరించారు.దసరా పండగ సందర్భంగా మెట్రో ప్రయాణికులకు అధికారులు చార్జీల్లో రాయితీ ప్రకటించారు.

మెట్రో సువర్ణ ఆఫర్ పేరుతో అప్ టు 40 శాతం వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్స్‌ను ప్రయాణికులకు అందిస్తున్నట్లుగా ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి గతంలో తెలిపారు. శనివారం (అక్టోబరు 17) నుంచి ఈ నెలాఖరు వరకు ఛార్జీల్లో ఆఫర్లు వర్తిస్తాయని చెప్పారు. వరదల వల్ల నగరంలో రోడ్లు దెబ్బతినడంతో ప్రయాణం కష్టంగా మారిందని.. ఈ క్రమంలోనే మెట్రోలో ప్రయాణాలకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాయితీలు ప్రకటించినట్లు వివరించారు. అయితే తే.గీ ఇది వరకు ప్రకటించిన దసరా పండగ ఈ సందర్భంగా వివిధ రకాల ఆఫర్ ను మెట్రో ప్రకటించింది అదే విధంగా దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ ఆఫర్ ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: