రక్షణ రంగంలో వస్తున్న అధునాతన పరిజ్ఞానాలను సమకూర్చుకోవడంపై భారత సైన్యం దృష్టి పెట్టింది. ఈ హైటెక్​ అంశాలకు అలవాటు పడటం, భవిష్యత్​ యుద్ధాల్లో అవి చూపే ప్రభావం వంటి అంశాలపై మదింపు చేపట్టింది. సోమవారం నుంచి గురువారం వరకూ ఢిల్లీలో జరిగిన సైనిక కమాండర్ల సదస్సు (ఏసీసీ)లో దీనిపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు  తెలిపాయి. దీనికితోడు చైనా, పాకిస్థాన్​లు కుమ్మక్కై భారత్​తో యుద్ధానికి దిగితే ఎదుర్కోవడంపై కూడా చర్చించినట్లు వివరించాయి.



హైటెక్​ సాధన సంపత్తికి సంంబధించిన ఒక మార్గ సూచీని సైన్యంలోని శిక్షణ విభాగం.. కమాండర్ల సదస్సుకు సమర్పించింది. హైపర్​సొనిక్​, విద్యుదయస్కాంత ఆయుధాలు, కృత్రిమ మేధస్సు, మూకుమ్మడి దాడులు చేసే డ్రోన్లు, రోబోటిక్స్​, లేజర్లు, కొద్దిసేపు గాల్లోనే సంచరించే వినూత్న ఆయుధాలు, బిగ్​ డేటా అనాలసిస్​, ఆల్గోరిథమిక్​ యుద్ధం వంటివి రక్షణ రంగంలో కీలకంగా మారనున్నాయి. హైపర్​సొనిక్​ ఆయుధాల విషయంలో భారత్​ ఇప్పటికే కొంత పురోగతి సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: