దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్​లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయని జాతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. 58ఏళ్ల తర్వాత ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు ఐఎండీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా ఢిల్లీలో అక్టోబర్​ నెలల్లో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీ సెల్సియస్​గా నమోదవుతుంటాయి. అయితే.. ఈ అక్టోబర్​లో 17.2 డిగ్రీ సెల్సియస్​గా నమోదయ్యాయి. 1962లో నమోదైన 16.9 డిగ్రీల సెల్సియస్​ తర్వాత ఇదే అత్యల్పం అని ఐఎండీ తెలిపింది..


గత గురువారం(అక్టోబర్​ 29న) ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.5 డిగ్రీ సెల్సియస్​గా రికార్డైంది. 26 ఏళ్లలో అంటే 1994 తర్వాత అక్టోబర్​ నెలలో ఒక్కరోజులో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఇదే కావడం గమనార్హం. అయితే.. ఆకాశం మేఘావృతమవడం, మబ్బులు కమ్మేయడం వల్లే.. ఉష్ణోగ్రతలు అత్యల్పస్థాయికి పడిపోయాయని ఐఎండీ ప్రాంతీయ డైరెక్టర్​ కుల్దీప్​ శ్రీవాస్తవ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: