నలుగురు ఉగ్రవాదులను కాల్చి చంపిన నవంబర్ 19 నాగ్రోటా ఎన్‌కౌంటర్‌  ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్కౌంటర్ విషయంలో ఆర్మీ కాస్త ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ ఉగ్రవాదులకు పాక్ నుంచి సహకారం వచ్చింది. 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరం దాడిలో ప్రధాన నిందితుడైన జైష్-ఇ-మొహమ్మద్ (జెఎమ్) కార్యాచరణ కమాండర్ కాసిమ్ జాన్ ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది.

భారతదేశంలో జైష్ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే ప్రధాన కమాండర్లలో జాన్ ఒకడు. ఇక్కడి పరిస్థితులను అతను పాకిస్తాన్ చేరవేస్తూ ఉంటాడు. భారత ఉగ్రవాద నిరోధక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జైష్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు మీదుగా 14 మంది ప్రత్యేక శిక్షణ పొందిన ఉగ్రవాదులు గుజరన్వాలా వద్ద చొరబడటానికి ఎదురు చూస్తున్నారు అని వెల్లడించారు. గ్లోబల్ పొజిషనింగ్ సెట్లు, వైర్‌లెస్ హ్యాండ్‌హెల్డ్ సెట్లు వాటిని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: