విశాఖలో పారిశ్రామిక వేత్తలతో రాష్ట్ర  ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడారు.  పారిశ్రామిక వర్గాల నుండి వారి అభిప్రాయాలను సమస్యలు తెలుసుకోవడం కోసం  సమావేశం ఏర్పాటు చేశాం అన్నారు. కొన్ని సమస్యలు పరిష్కరిస్తాం మరికొన్ని పాలసీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మరికొన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాల్సి ఉంది అని చెప్పారు.

ఫుడ్ ప్రాసెసింగ్  పాలసీ తీసుకొస్తాం అని అన్నారు. విశాఖపట్నం బ్రాండ్  మరింత పంచేందుకు అన్నివర్గాల  సహకారం తీసుకుంటాం అని వివరించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ...  మెడిటెక్ విషయంలో ఇంత వరకు ఏం చేశారు ఏం చేయలేదని విషయాలపై ఒక నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రకాల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు అని చెప్పారు. కొన్ని విధానపరమైన నిర్ణయాలు పై ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటాం అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: