ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.  పాలనా రాజధానిగా మారిన క్రమంలో, విశాఖలో పారిశ్రామిక అభివృద్ధి పై మరింత దృష్టి పెట్టాం అని చెప్పారు. త్వరలోనే  మరిన్ని విధానాలను తీసుకువస్తాం అని తెలిపారు. విశాఖను టైర్ వన్ సిటీ గా అభివృద్ధి చేయాలని నిర్ణయం.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం అని స్పష్టం చేసారు.

విశాఖ ప్రజలలో మరింత కాన్ఫిడెన్స్ నింపి.. దేశంలోని,  ప్రపంచంలోని అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చారు. విశాఖపట్నానికి,  లోకేషన్, లేబర్ అవైలబుల్ టి అడ్వాంటేజ్ ఉంది అన్నారు. అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుంచి పెట్రోలియం ట్రైబల్  యూనివర్సిటీ లు వస్తున్నాయని ప్రకటించారు. దేశవ్యాప్తంగా వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ కు  11 శాతం ఎఫ్డిఐలు  రాబోతున్నాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: