ఏపీలో మహిళల రక్షణ విషయంలో రాష్ట్ర సర్కార్ చాలా వరకు కూడా దూకుడు గా ఉంది అనే చెప్పాలి. రాష్ట్రంలో దాదాపుగా మహిళల రక్షణ కోసమే సిఎం జగన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అనే చెప్పాలి. ఇప్పుడు మరో యాప్ ని రాష్ట్ర సర్కార్ ప్రవేశ పెడుతుంది. ఇవ్వాళ అభయ్ యాప్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారు సీఎం జగన్. క్యాబ్, ఆటోల్లో ప్రయాణించే మహిళల రక్షణ కు ఉపయగపడనుంది ఈ నూతన యాప్.

138.48 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐవోటీ ప్రాజెక్టును చేపట్టాయి. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వెయ్యి ఆటోల్లో ట్రాకింగ్ డివైజ్ లు ఏర్పాటు చేసారు అధికారులు. వచ్చే నవంబర్ నాటికి లక్ష వాహనాల్లో ట్రాకింగ్ పరికరాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. దీనిపై హర్షం వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: