గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందడి కాస్త ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పుడు ఎన్నికల సంఘం కాస్త సీరియస్ గా ఉంది అనే చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పై ధాఖలైన పిటీషన్ పై నేడు హైకోర్టు విచారణ చేస్తుంది. రీజర్వేషన్ రొటేషన్ పద్దతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్ట వీరుద్దమని పిటీషన్ దాఖలు చేసారు.

పిటీషన్ దాఖలు చేసింది బీజేపీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్. ప్రభుత్వం తీసుకొచ్చిన జీహెచ్ఎంసి యాక్ట్ సెక్షన్ 52ఈ రీజర్వేషన్ పాలసీ కి విరుద్ధంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలు నిర్వహించకుండా స్టే ఇవ్వాలని  పిటిషన్ దాఖలు చేసారు. నేడు పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారిస్తుంది. అయితే పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp