మహారాష్ట్రలోని కరోనావైరస్ పరిస్థితి మరియు రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం చేయడం మొదలు పెట్టడంతో శివసేన సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) పై తీవ్ర స్థాయిలో దాడి చేసింది. కరోనావైరస్ మహమ్మారిపై పోరాడటానికి ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుంటే... బిజెపి "నిరసనలు నిర్వహించడం, జనాన్ని సమీకరించడం ద్వారా ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోంది" శివసేన ఆరోపించింది.

2 వ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం ఎదుర్కొన్న అతి పెద్ద సంక్షోభం కరోనావైరస్ అని శివసేన పేర్కొంది. పెరిగిన విద్యుత్ బిల్లులు, ఇద్దరు సాధువులను చంపిన పాల్ఘర్ లించ్ కేసుపై మహారాష్ట్రలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని బిజెపి పిలుపునిచ్చింది. కరోనా ఇప్పటికీ మన మధ్య ఉందని, అయితే "రాజకీయ లాభాల కోసం జనాలు గుమిగూడారు" అని శివసేన ఆరోపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: