కరోనా సమయంలో మరణించిన మృతదేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాని కొందరు వైద్యులు మాత్రం ఒకరు మరణిస్తే మరొకరి మృతదేహాలు అప్పగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగనాస్ జిల్లాలోని ఒక ఆసుపత్రి ఒక వృద్ధ కరోనా రోగిని చనిపోయినట్లు తప్పుగా ప్రకటించి, మరొక రోగి మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం తన బంధువులకు అప్పగించింది.

కరోనా బారిన  పడిన షిబ్దాస్ బెనర్జీ (75) ను నవంబర్ 4 న బాల్రాంపూర్ బసు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. నవంబర్ 13 న, ఆసుపత్రి తన బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని అప్పగించడం అంత్యక్రియలు చేయడం కూడా జరిగాయి. ఒక వారం తర్వాత ఆసుపత్రి అతని కుటుంబ సభ్యులను పిలిచి, అతను సజీవంగా ఉన్నాడని, కరోనా నుంచి కోలుకున్నాడు అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: