మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. తమ పార్టీ 'అఖండ్ భారత్' ను నమ్ముతోందని, కరాచీ ఏదోక ఒక రోజు భారతదేశంలో భాగమవుతుందని అన్నారు.  బాంద్రా వెస్ట్‌లోని కరాచీ స్వీట్స్ షాప్ యజమానిని తమ దుకాణం పేరు నుండి 'కరాచీ' అనే పదాన్ని తొలగించమని ఒక శివసేన నాయకుడు వార్నింగ్ ఇచ్చిన ఘటనపై ఆయన స్పందించారు.

 “మేము 'అఖండ్ భారత్' ను నమ్ముతున్నాము. కరాచీ ఒక రోజు భారతదేశంలో భాగమవుతుందని మేము కూడా నమ్ముతున్నాము, ”అని ఫడ్నవిస్ అన్నారు కరాచీ స్వీట్స్ షాపు యజమాని దుకాణం పేరు మార్చమని శివసేన నాయకుడు నితిన్ మధుకర్ నందగావ్కర్ ఒక వీడియో విడుదల చేసారు. దీనితో స్వీట్ షాప్ యజమాని కరాచి అనే పేరు కనపడకుండా జాగ్రత్త పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: