ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ గట్టిగా తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని ఒవైసీని మహిళలు నిలదీశారు. జాంబాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి రవీందర్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఒవైసీ. గతం లో ఎంఐఎం ని గెలిపిస్తే జాంబాగ్ లో ఎలాంటి అభివృద్ధి లేదని ఆందోళన చేపట్టారు. తాము కష్ట కాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా , ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించిన స్థానిక మహిళలు... వెనక్కు వెళ్ళాలి అని డిమాండ్ చేసారు.

ఐదేళ్లకోసారి వచ్చి ఓట్లు అడిగి...గెలవగానే మొహం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. దీనితో ఏం చేయాలో అర్ధం కాని ఒవైసీ... వారికి సమాధానం ఇవ్వకుండానే ఒవైసీ వెనక్కు వెళ్ళారు. ఇక స్థానిక నేతలు కూడా అక్కడితో ప్రచారం చేయకుండా వెళ్ళిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: