ఏపీలో న్యాయమూర్తుల విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కాస్త దుమారంగా మారుతున్నాయి. తీవ్ర స్థాయిలో ఇప్పుడు ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్ట్ లో విచారణ జరిగింది. న్యాయమూర్తులను దూషించిన వ్యవహారంలో సుమోటోగా తీసుకున్న హై కోర్టులో నేడు విచారణ జరిగింది.

హైకోర్ట్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ కేసులో ప్రతివాదులు ఎక్కువగా ఉన్నందున ప్రత్యక్ష విచారణ చేపట్టాలని నిర్ణయించింది  ధర్మాసనం. హై కోర్టులో ప్రత్యక్ష విచారణ ప్రారంభమైన వెంటనే సుమోటో కేసు విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ వాయిదా వేసింది. ఇక దీనిపై ఇప్పటికే సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి రెండో రోజు విచారణ జరిగింది. మరి ఈ కేసులో ఎవరు దోషులో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: