ఏపీకి నివార్ తుపాన్ ముప్పు ఎక్కువగా ఉంది. బంగాళాఖాతంలో నివార్ సైక్లోన్ తో అప్రమత్తమైన ప్రభుత్వం... చర్యలు చేపట్టింది. 24 గంటల్లో తుపాన్ గా బలపడనున్న వాయుగుండం రైతుల్లో ఆందోళన మొదలయింది. మూడ్రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.

ఈ నెల 25, 26వ తేదీలలో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసారు. ఇప్పటికే తుపాన్ ప్రభావిత ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ శాఖ... పలు సూచనలు చేసింది. వ్యవసాయ, వైద్య, రెవెన్యూ శాఖలను అలర్ట్ చేసింది ఏపీ సర్కార్. కోతకు సిద్ధంగా వరి, మినుము, పత్తి, పొద్దుతిరుగుడుకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పంట కోతలు చేపట్టాలని రైతులకు సూచనలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: