దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటివరకు భారత్‌లో కరోనా కేసులు 91 లక్షల దాటాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

ఇక దేశంలో గడిచిన 24 గంటల్లో 37,975 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 91,77,841కి చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 480 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,34,218కు చేరుకుంది. దేశంలో 4,38,667 యాక్టివ్‌ కేసులున్నాయి. 86,04,955 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా సెకండ్ వే మొదలయ్యే అవకాశం ఉండటంతో అందరు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: