శివసేన పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ఇంట్లో, పార్టీ కార్యాలయంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మంగళవారం తనిఖీలు చేపట్టారు. మనీ లాండరింగ్ కేసులు ఈడీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అయితే, ఇంత ఆకస్మాత్తుగా సోదాలు నిర్వహించడానికి గల కారణాలు ఈడీ వెల్లడించలేదు. థానేలోని ఓవల-మజివాడ నియోజకవర్గ  ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ఇటీవల బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యవహారంలో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. కంగనా రనౌత్ ముంబయిని పాక్ ఆక్రమిక కశ్మీర్ గా పేర్కొంది. దీంతో ఎమ్మెల్యే ఆమెపై కేసు పెట్టాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ఎమ్మెల్యే సర్నాయక్ సోషల్ మీడియా ఖాతాలో మరాఠీలో ఇలా రాసుకొచ్చారు. ‘‘ సజయ్ రౌత్ మాములుగానే కంగనా రనౌత్ ను హెచ్చరించారు. ఆమె ముంబయికి వస్తే మా సాహస మహిళలు ఆమెను నిద్రపోనియ్యరు. ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోల్చిన కంగనను దేశద్రోహం కేసు పెట్టాలి.’’ అని ఆయన అన్నారు. అయితే ఎమ్మెల్యే మాటలపై ఎస్.సీ.డబ్ల్యూ చైర్ పర్సన్ రేఖా శర్మ ఘాటుగా స్పందించారు. కంగనాను బెదిరించిన శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: