గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు కాస్త దూకుడుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కూడా నగదు పంపిణీ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించడం లేదు. దీనిపై ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి మరీ ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాయి. పోటీ చేస్తున్న పార్టీల నేతల కాన్వాయ్ లను ఎక్కువగా చెక్ చేస్తున్నారు. సరైన కారణాలు, రసీదులు లేకుండా తీసుకు వెళ్తున్న డబ్బుని సీజ్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ కూడా చెక్ చేసారు. జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 65లో నారా లోకేష్ కాన్వాయ్ ను చెక్ చేసారు తెలంగాణ పోలీసులు. ఆయన వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేసి పంపించారు. లోకేష్ అక్కడి నుంచి విజయవాడ వస్తున్నారు. ఈ నేపధ్యంలో నగదు ఏమైనా ఉందా అనే దాని మీద తనిఖీ చేసి పంపించారు

మరింత సమాచారం తెలుసుకోండి: