టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉపఎన్నికల సాంప్రదాయాలకు తూట్లు పొడిచింది వైసీపీనే అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకత మొదలయ్యే సరికి వైసీపీకి వణుకు పుట్టింది అన్నారు. 17 నెలల అరాచకానికి తిరుపతి నుండే చరమగీతం పాడాలి అని ఆయన కోరారు. శోభా నాగిరెడ్డి చనిపోతే ఏకగ్రీవానికి చంద్రబాబు సహకరించారు. కానీ నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టింది అని గుర్తు చేసారు.

ప్రజా వ్యతిరేకత పెరిగే సరికి వైసీపీ సాంప్రదాయాలు గుర్తొచ్చాయి అని విమర్శించారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా తిరుపతిలో అభ్యర్థిని ప్రకటించారని రోజా అనడం హాస్యాస్పదం అన్నారు. ఎప్పుడు రద్దవుతుందో తెలియని ఎమ్మెల్సీతో  బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను మోసం చేస్తున్నారు అని, దళితులను దగా చేస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని నిలదీశారు. చనిపోయిన కుటుంబంలోనే సీటు ఇవ్వాలని జగన్ రెడ్డికి రోజా ఎందుకు చెప్పలేదు? అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: