బిజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు  కీలక వ్యాఖ్యలు చేసారు. శని, ఆదివారాల్లో కూడా కోర్ట్ బెంచ్ వుండాలి అని ఆయన డిమాండ్ చేసారు. చిన్న చిన్న ఉల్లంఘనలు వున్నా కూల్చివేస్తారనే భయం మొదలైంది అని, కోర్టుకు వెళ్లే అవకాశాన్ని హక్కును కూడా హరిస్తూ చేసే ప్రయత్నాను ఖండిస్తున్నాము అని మండిపడ్డారు. హౌసింగ్ కోసం   7లక్షల ఒక వెయ్యి ఇళ్లకి కేంద్రం అప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.

వైసిపి ప్రభుత్వ వచ్చాక ఒక్క అంగుళం పనికూడా జరగలేదు అని, ఇళ్లు వస్తాయని ఆశపడే వారికి నిరాశ మిగిలింది అని మండిపడ్డారు. అర్హత వున్న వారికి లాటరీ తీసి ఇస్తామని చెపుతున్నారు అని ఆయన విమర్శించారు. ఇది వరకే కేటాయింపులు జరిగినా వాటిని ఎందుకు అమలు చేయడంలేదు అని నిలదీశారు. అప్పులు చేసి వడ్డీలు కట్టి ఇళ్లకోసం ఎదురుచూస్తున్న వారి పరిస్ధితి దారుణం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కాగా విశాఖలో టీడీపీ నేతల కట్టడాలు కూలుస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: