ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు క్రమంగా బలపడి అతి తీవ్ర తుఫానుగా మారింది. దీనితో ఇప్పుడు పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. తమిళనాడులో ఏడు జిల్లాలకు అక్కడి ప్రభుత్వం రవాణా పూర్తిగా నిలిపివేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఇక అతి తీవ్ర తుఫాన్ గా మారిన నివర్ దెబ్బకు ఏపీ కూడా కంగారు పడుతుంది.

చెన్నైకి ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో నివర్ తుఫాన్ ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్ తీవ్రత గంట గంటకు పెరుగుతుంది. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. తీరం దాటే సమయంలో నివర్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు తమిళనాడులో సెలవు కూడా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: