నివర్ తుఫాన్ దెబ్బకు ఇప్పుడు తమిళనాడు ఏపీ రాష్ట్రాలు భయపడుతున్నాయి. రెండు రాష్ట్రాల సిఎం లు కూడా అధికారులతో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. తుఫాన్ తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ అధికారులతో అత్యవసర సమీక్షలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా అధికారులతో  ఆయన మాట్లాడుతున్నారు.

జిల్లా కలెక్టర్  భరత్ గుప్తాతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. తుఫాన్ తీవ్రత చిత్తూరు జిల్లా మీద, నెల్లూరు జిల్లా మీద ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపధ్యంలో జగన్ అధికారులకు అన్ని సూచనలు చేసారు. నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలు మొదలయ్యాయి. కృష్ణపట్నం పోర్ట్ లో కూడా పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. నెల్లూరు సముద్ర తీర ప్రాంతాల మీద అధికారులు ఫోకస్ చేసారు. తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: