ఏపీలో సిఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక కీలక  నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలను మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ అర్బన్ క్లీనిక్కుల ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 560 వైఎస్సార్ అర్బన్ క్లీనిక్ లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు జారీ చేసింది. అర్బన్ క్లీనిక్కుల ఏర్పాటు కోసం  355 కొత్త భవనాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.  205  భవనాలకు మరమ్మత్తులు నిర్వహించి పరికరాలను సమకూర్చాలని ఆదేశాల్లో పేర్కోన్న ప్రభుత్వం...  వైఎస్ఆర్ క్లీనిక్కుల నిర్మాణానికి జాతీయ ఆరోగ్య మిషన్ , రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నుంచి నిధులు మంజూరు చేయనున్నట్టు వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: