గ్రేటర్ హైదరాబాద్  మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పై తాము ఇప్పుడు ఏలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణా హైకోర్ట్ స్పష్టం చేసింది. మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మేయర్ , కార్పోరేటర్ల రీజర్వేషన్ లు  సక్రమంగా జరగలేదని పిటిషనర్ రచనా రెడ్డి వాదించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రీజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని వెంటనే ఎన్నికలను నిలుపుదల చేయాలని కోర్టును అడ్వొకేట్ రచనా రెడ్డి కోరారు.

ఎన్నికలు మరో వారం రోజులు ఉన్న సమయంలో ఇప్పుడు తాము ఏలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల పైన వేసిన పిల్స్, రిట్ పిటీషన్ లను అన్ని కలిపి డిసెంబర్ 23 న విచారిస్తామని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్ 23 కు వాయిదా వేసింది తెలంగాణా హైకోర్ట్. రిజర్వేషన్ లు పాత నిర్ణయం ప్రకారమే జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: