ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నాయి. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు బుధవారం హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల కార్యాచరణ పై ఆమె దిశ నిర్దేశం చేశారు.అనంతరం మీడియా తో మాట్లాడుతూ అభివృద్దే బి‌జే‌పి ప్రదాన లక్ష్యమని తెలిపారు.

టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలసిపోయి ప్రజలను మోసం చేస్తున్నారని  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు.తెలంగాణను అభివృద్ది పథంలో నడపాలని సూచించారు. అవినీతి, అవకాశవాద పొత్తు వల్ల హైదరాబాద్ వరదలతో మునిగింది. వరదల్లో 80 మంది మృతి చెందారు. 

వారికి సహాయ కార్యక్రమాలు చెయ్యడంలో అధికార పార్టీ విఫలం అయ్యిందని ఆమె పేర్కొన్నారు. దుబ్బాక ఉపఎన్నికతో తెలంగాణ ప్రజల సపోర్ట్‌ అధికార పార్టీకి లేదని తెలిసిపోయిందని,టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు కలిసి సాగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదు అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు ద్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: