అమెరికాలో కరోనా కేసుల తీవ్రత ఏ మాత్రం ఆగడం లేదు. ప్రతీ రోజు కూడా అమెరికాలో కరోనా కేసుల్ భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా తీవ్రత దెబ్బకు అమెరికాలో ఇప్పుడు ఆస్పత్రులు కూడా సరిపోవడం లేదు. కరోనా తీవ్రత అక్కడ ఏ రేంజ్ లో ఉంది అంటే ప్రతీ రోజు కూడా 2 వేల మంది చనిపోతున్నారు. నిన్న ఒక్క రోజే 2100 మంది ప్రాణాలు కోల్పోయారు అని అమెరికా వెల్లడించింది.

అమెరికాలో కరోనా కేసులు నిన్న ఒక్క రోజే ఒక లక్షా 70 వేలకు పైగా నమోదు అయ్యాయి. ఇక కరోనా కేసుల తీవ్రత దెబ్బకు అమెరికాలో మళ్ళీ లాక్ డౌన్ దిశగా వెళ్తారా అనే ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. అయితే ఆ దేశానికి ఆస్పత్రుల కొరత చాలా ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: